KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం సాయంత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై గోపాల్పేట్కు వెళ్తుండగా ధర్మారెడ్డి గ్రామశివారు వద్ద కారు ఢీకొట్టింది. దీంతో సతీష్ బైక్ పైనుంచి కిందపడ్డారు. వెంటనే కారులో ఉన్న వ్యక్తులు ఆయనను ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.