ATP: పామిడి మండలం దేవరపల్లి గ్రామంలో బుధవారం హిందూ ధర్మ సమ్మేళన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం పీఠాధిపతి వీరిజానంద స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మం గొప్పదనం, సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. దేశంలో మతమార్పిడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు.