SRPT: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పల్లెల నవీన్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బుధవారం మానవత హృదయం కలిగిన మోతె గ్రామ నివాసి అయిన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ. గిరిధర్ రెడ్డి సుమారు 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. నూతనంగా గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన అనురాధ చేతుల మీదగా మృతుని భార్య నందినికి అందజేశారు.