ELR: ద్వారకతిరుమలలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకొని, మీడియా ఎదుట హాజరుపరిచారు. భీమడోలుకు చెందిన ప్రవీణ్ కుమార్, శివనాగు, గొల్లవానితిప్ప గ్రామస్థుడు ఈ చోరీలు చేసినట్లు ఏలూరు DSP శ్రావణ్ కుమార్, SI సుధీర్ చెప్పారు.