W.G: విద్యార్థులు ట్రాఫిక్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. ఇవాళ ఆదిత్య కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షణ కవచమని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ కోనేటి రావు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించారు.