KNR: వీణవంక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచారు. తన గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వీణవంకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు