E.G: రాజమండ్రిలోని గాంధీపురం-3 నందు ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఈనెల 21వ తేదీన ఆవిష్కరణ జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మండల బీజేపీ అధ్యక్షురాలు లక్ష్మి, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.