SKLM: లావేరు మండలంలోని మురపాక, వెంకటాపురం, తామాడ, నేతేరు, లోపెంట, చిన్న మురపాక, పలు గ్రామాల్లో బుధవారం ఉదయం ధనుర్మాస మేలుకొలుపు భజనలు ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం సందర్భంగా వేకువజామున ముందుగా జగన్నాథ స్వామి, రామాలయాల్లో సీతారామ స్వామి వారికి భజన బృందాల సభ్యులు, మహిళ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.