డయాబెటిస్ అనేది శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే వ్యాధి. డయాబెటిస్ ఉన్న వారిలో, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలలో జలదరింపు కలుగుతుంది. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ప్రమాదకరం కావచ్చు. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా విస్తరించవచ్చు. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తమ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.