SRD: కంగ్టి మండలం ఘనపూర్ సర్పంచిగా కురాకుల శ్వేత కృష్ణ విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సమీప ప్రత్యర్థి సంతపురం జ్యోతిక పై 240 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.