MDK: రామాయంపేట పట్టణంలోని ఓ గ్రాండ్ రెస్టారెంట్లో ఆహార భద్రతాధికారి స్వదీస్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు, బూజు పట్టిన పాపడ్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ధ్వంసం చేసి, నిబంధనల ఉల్లంఘనలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేయడానికి పంచనామ నిర్వహించినట్లు పేర్కొన్నారు.