WGL: చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.