సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గ మహిళ నాయకులతో కలిసి మంత్రి సవిత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొంది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా జరిగింది.