సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.10.96 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు బుధవారం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు.