NGKL: జిల్లాలో బుధవారం నిర్వహిస్తున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు అత్యధికంగా చారకొండ మండలంలో 27.73% పోలింగ్ నమోదుకాగా, అతిస్వల్పంగా బల్మూర్ మండలంలో 22.4% పోలింగ్ నమోదయింది. అచ్చంపేట 27.45%, లింగాల 27.16%,ఉప్పునుంతల 25.80%, పదరా 25.29%, అమ్రాబాద్ 25.26% పోలింగ్ నమోదయింది.