KNR: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అల్లేపు సంతోష్, ఉప సర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి తమ అనుచరులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.