JGL: గొల్లపల్లి మండలంలోని దట్నూర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు బెక్కం గంగారం గెలుపొందారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. వెల్గటూరు మండలంలోని కుమ్మరిపల్లె గ్రామ సర్పంచ్ జక్కుల అమని మహేష్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ప్రజల మద్దతుతో గెలుపొందారు. గోవిందుపల్లి గ్రామ సర్పంచ్ గా మ్యాక స్వామి గెలిచారు.