KRNL: ఆదోని తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన శేషఫణి బుధవారం ఎమ్మెల్యే పార్థసారధిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సేవలు అందించాలన్నారు.