NLG: జిల్లా నుంచి హైదరాబాద్కు బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కొరతతో నిల్చునే ప్రయాణం తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నామంటున్నారు. ఈ మార్గంలో బస్సుల సంఖ్య పెంచి, సమయపాలన మెరుగుపరచాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.