ఐపీఎల్ 2026 సీజన్ కోసం వేలంలో కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో పవర్ హిట్టర్లు ఉన్నా.. నిఖార్సైన బౌలింగ్ యూనిట్ లేకపోవడంతో టీమ్ బలహీనంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో 300 స్కోర్ చేసినా.. ప్రత్యర్థిని కట్టడి చేసే బౌలర్లు లేరని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.