AKP: నాతవరంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం 176 మంది అంగన్వాడీలకు అత్యాధునిక 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఫోన్ల ద్వారా లబ్ధిదారుల వివరాలు, ఫేస్ రికగ్నైజేషన్, ఆరోగ్య పరీక్షలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, పౌష్టికాహారం సరైన వారికి చేరడం సులభమవుతుందని తెలిపారు. అంగన్వాడీల సేవలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ ఫోన్లను అందజేసిందన్నారు.