GDL: ధరూర్ మండలం రేవులపల్లిలో రూ.7 కోట్లతో చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, సర్పంచ్ శృతి రాఘవేంద్ర మక్తల్‌లోని క్యాంపు ఆఫీసులో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని బుధవారం కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీహరి రేవులపల్లి గ్రామంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.