ASR: డుంబ్రిగూడ మండలంలోని కించుమండ వరకు సంతల్లో బుధవారం లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లీటర్ మోడు సెట్టింగ్‌తో గిరిజన రైతులను మోసం చేస్తూ పంటలు కొనుగోలు చేస్తున్న కమిషన్ ఏజెంట్లపై ఐదు కేసులు నమోదు చేశారు. ముద్రలేని నాలుగు కాటాలపై, అధిక ధరలకు శీతల పానీయాలు విక్రయించిన ఓ దుకాణంపై కూడా కేసులు నమోదు చేశారు.