మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు DMHO డాక్టర్ అనిత తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో సుమారు 2 లక్షల 12,500 ఇళ్లను సర్వే చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 70 లెప్రసీ కేసులను గుర్తించి చికిత్సలు అందించడం జరుగుతున్నదన్నారు.