MDK: నర్సాపూర్ మండలం మాదాపూర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన రమావత్ సునీత-రాములు ఘనవిజయం సాధించారు. పంచాయతీ 8 వార్డుల్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 5 వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిపై 49 ఓట్ల తేడాతో గెలిచిన సునీత అనుచరులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.