E.G: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు YCP ఇంఛార్జ్ తలారి వెంకట్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకస్తూ చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతంపై తలారిని జగన్ అభినందించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.