E.G: కోరుకొండ శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు పురస్కరించుకుని ఈనెల 23వ తేదీన ఆలయ వద్ద అన్న సమాధాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి బీజేపీ నేత, విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు లక్ష రూపాయల చెక్ ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు.