ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ గ్రామానికి చెందిన వడ్డే శివశంకర్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. శివశంకర్ కుటుంబానికి కేశవరెడ్డి రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, వడ్ల రాము, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.