KDP: కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా. ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.