TPT: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవిప్రభు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినట్లు చెప్పారు.