దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్లో భారత్ పరుగుల వరద సృష్టించింది. మలేషియాపై 50 ఓవర్లలో 408/7 భారీ స్కోరు చేసింది. అభిజ్ఞాన్ కుందు(209*) డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించగా, త్రివేది(90), సూర్యవంశీ(50) దంచికొట్టారు. మలేషియా బౌలర్ అక్రమ్ 5 వికెట్లు తీసినా టీమిండియా జోరు తగ్గలేదు. మలేషియా ముందు 409 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.