CTR: పలమనేరు డివిజన్ ఉపాధ్యాయులకు జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో పుంగనూరు జట్టు మంగళవారం సెమీఫైనల్స్‌కు చేరుకుంది. చౌడేపల్లి మండలం దాదేపల్లి మైదానంలో ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. పలమనేరు జట్టుపై పుంగనూరు జట్టు విజయం సాధించింది. పుంగనూరు జట్టుకు తులసీదాస్ సారద్యం వహించారు. నాయక్ 98, దాదాపీర్ 42 పరుగులతో పుంగనూరు జట్టు విజయం లో ప్రముఖపాత్ర పోషించారు.