TG: గత ఖరీఫ్ సీజన్లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడంతో రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.