AP: రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో జరిగింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ఉండనుంది.