W.G: ఉండి మండలానికి చెందిన కరణం భాను ప్రకాష్, గంధం భవాని దుర్గల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు చేరకుండానే వివాదాస్పదంగా మారింది. గతంలో భవానీ దుర్గ తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ప్రియుడు భాను ప్రకాష్ అడ్డుకుని, ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం కూడా జరిగింది. ఎనిమిది నెలలు గడిచినా పెళ్లిపై స్పష్టత లేదని ఆందోలన చేపట్టారు.