కడప: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ వంటి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే 112కు ఇవ్వాలని సూచించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపవద్దని వాహనదారులకు హెచ్చరించారు.