KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్రకు ముస్లింలు ఘనస్వాగతం పలికారు. ‘అంజన్న ఆశీర్వాద పాదయాత్ర’ గంగాధర మండల శివారులోని తుర్కశి నగర్‌కు చేరుకోగానే ముస్లింలు ఆయనకు శాలువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. వారితో కాసేపు ముచ్చటించిన బండి సంజయ్.. అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.