CTR: బైక్‌లపై ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ మంగళవారం సూచించారు. వాటిని ధరించకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా ట్రాక్టర్ వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు అతికించుకోవాలని ఆయన తెలిపారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ పనికిరాదని పేర్కొన్నారు.