KDP: పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలోని శ్రీ మాధవరాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి గోత్రనామాలు చదివి పూజలు నిర్వహించి పూలమాలలు, దుశ్శాలువాతో సన్మానం చేశారు.