BDK: అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ DSP బీ.రమేష్ పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలపై యువత అవగాహన కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకి బానిస కాకూడదని తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.