అన్నమయ్య: ఏపీ రాష్ట్రంలోని 26 జిల్లాలను జోన్ల వారీగా విభజించే క్రమంలో అన్నమయ్య జిల్లాను జోన్–5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలు కలిసి మల్టీ జోన్–2లో చోటు దక్కించుకున్నాయి.