అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా మలేషియాలో తలపడుతున్న మ్యాచ్లో అభిజ్ఞాన్ కుందు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 125 బంతుల్లోనే డబుల్ సెంచరీ(209*) బాదేశాడు. ఈ ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు కొట్టాడు. గ్రౌండ్లో అన్ని వైపులా షాట్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.