NLG: గుర్రంపోడు మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తేనేపల్లి తండా సర్పంచ్‌గా వడిత్య రజిత జవహర్ లాల్ జిల్లాలొ తొలి సర్పంచ్‌గా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వడిత్య శాంతి మీద 84 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.