KMR: పెద్ద కొడఫ్గల్ మండలం శివాపూర్ సర్పంచ్‌గా ఉత్తమ్ రావ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.