NZB: నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజల కష్ట, నష్టాల్లో తోడుంటూ, ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. బుధవారం మోస్రా గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తరఫున గెలిచిన సర్పంచులు పాలనలో కొత్తదనాన్ని చూపాలన్నారు.