NRPT: మాగనూరు మండలంలోని నేరేడుగం దొడ్డి గ్రామపంచాయతీకి బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటయ్య తన సమీప అభ్యర్థిపై 20 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామస్థుల సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.