NDL: నంద్యాల ముల్లాన్ పేటలో మూడేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నంద్యాల GGHలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పట్టణంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయని, మున్సిపల్ అధికారులు కుక్కల గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.