SDPT: అక్కన్నపేట మండలం నందారం గ్రామ సర్పంచ్ సుగుర్తి శ్రీలత బాలరాజు విజయం సాధించారు. దీంతో అనుచరులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.