NDL: పదో తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలో నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి సిలబస్ పూర్తి అయిందన్నారు. విద్యార్థులకు రివిజన్ జరుగుతున్నట్లు తెలిపారు.