ATP: దుర్గాంజనేయస్వామి ఆలయ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని MLA బండారు శ్రావణి మండిపడ్డారు. భక్తులకు అన్యాయం చేస్తున్న వ్యక్తికి మద్దతిస్తూ గుప్త నిధుల పేరుతో తమపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ హయాంలో దేవాలయాల ధ్వంసం, తిరుపతి లడ్డూ అపవిత్రతపై స్పందించని వారు నీతులు మాట్లాడటం విడ్డూరమన్నారు.